సినీ పరిశ్రమ గురించి, ఇక్కడ ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది నటీమణులు గొంతెత్తిన సంగతి చాలా మందికి తెలిసిందే. అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా తమ వేదన విన్నవించుకున్నారా? లేక మైక్ మీద ఉంది.. కెమెరా ముందు ఉంది కదా… హైలెట్ అవుదామని వైరల్ అవ్వడం కోసం లైం*గిక ఆరోపణలు ఎదుర్కొన్నట్టు చెబుతున్నారా? అనేది మాత్రం ఎవ్వరికీ క్లారిటీ ఉండదు.
ఎందుకంటే ఇప్పుడున్న రోజులు కూడా అలాంటివి. ఇండస్ట్రీ జనాలు కానీ సీనియర్ సినీ విశ్లేషకులు కానీ, ఎక్కువగా చెప్పేది ఏంటంటే.. ఫేడౌట్ అయిపోయిన నటీమణులు లేదా ఫేడౌట్ దశకు చేరుకున్న నటీమణులు మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళలో ఎక్కువ శాతం హైలెట్ అవ్వాలనుకునే వాళ్ళే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. తాజాగా మరో వ్యక్తి కూడా తాను లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నట్టు తెలిపి హాట్ టాపిక్ అయ్యింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ వ్యక్తి ఓ ట్రాన్స్ జెండర్ కావడం.అవును జబర్దస్త్ తో పాపులర్ అయిన తన్మయి ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ‘వర్జిన్ స్టోరీస్’ వంటి పలు చిత్రాల్లో నటించిన తన్మయి…’జబర్దస్త్’ ‘అదిరింది’ వంటి షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా ఆఫర్లు సంపాదిస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి’ అంటూ ఓ ఘాటు కామెంట్ వదిలింది. ఆమె పలికిన మాటలను గమనిస్తే.. “నా ఫ్యామిలీ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. మా నాన్న, అమ్మ ఇద్దరూ కూడా అనారోగ్యం పాలయ్యారు. అదే టైంలో ‘ఇండస్ట్రీలోని ఓ పెద్దాయన పిలిచినప్పుడల్లా రావాలని బెదిరించేవాడు.
నా ఫ్యామిలీ పరిస్థితి చెప్పినా కనికరించేవాడు కాదు. భయంకరమైన భూతులు తిట్టేవాడు.. కొట్టేవాడు.. అలా చాలా రకాలుగా హింసించేవాడు. నేను ట్రాన్ఫర్మ్ అయ్యాననే విషయం ఇంట్లో తెలీదు. పైగా నాకు డబ్బులు అవసరం పడి అలాంటి వాళ్ళతో ఉండాల్సి వచ్చింది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది తన్మయి.