ఈ మధ్య కాలంలో పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంది అంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో విషయంలో మొదటి రోజు కూడా హౌస్ ఫుల్స్ పడని పరిస్థితి. హైప్ ఉన్న పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. ఒకవేళ హైప్ లేకపోయినా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు.. డే1 అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతాయి అనే గ్యారెంటీ లేదు. 2వ రోజు నుండి పికప్ అవుతున్నాయి.
దాని వల్ల మొదటి రోజు ఆ సినిమాలకు రికార్డు ఓపెనింగ్స్ రావడం లేదు. అందుకోసమే పెద్ద సినిమాలు కూడా ప్రభుత్వాల నుండి అనుమతులు తెచ్చుకుని మిడ్ నైట్ షోలు వంటివి వేస్తూ వచ్చాయి. ఈ విషయంలో ‘పుష్ప 2’ మేకర్స్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్రీమియర్ షోలకు పర్మిషన్ తెచ్చుకున్నారు. వాటి టికెట్లు కూడా డైరెక్ట్ గా ఆన్లైన్లో పెట్టుకునేలా ప్రభుత్వాల నుండి అనుమతులు తెచ్చుకున్నారు. దీంతో ఆ సినిమా మొదటి రోజు ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి రికార్డులు కొట్టింది.
అందుకే పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ వేయడం కరెక్ట్ అని పెద్ద సినిమాల నిర్మాతలు డిసైడ్ అయ్యారు. దీని వల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. ప్రీమియర్స్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంది కాబట్టి.. బుకింగ్స్ ఆల్మోస్ట్ వంద శాతం జరిగిపోతాయి. ఒకవేళ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ప్రీమియర్స్ రూపంలోనే మంచి వసూళ్లు డే 1 కలెక్షన్స్ లో యాడ్ అవుతాయి.’హరి హర వీరమల్లు’ విషయంలో జరిగింది ఇదే.
ఒకవేళ పాజిటివ్ టాక్ కనుక వస్తే.. మొదటి రోజు మాత్రమే కాదు వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతాయి. ‘పుష్ప 2’ విషయంలో ఇదే జరిగింది. ఆ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడానికి కారణం అదే. ఈ విషయంలో ‘ఓజి’ టీం మాత్రం వెనుకబడింది. ఈ సినిమాకి భారీ హైప్ ఉంది. ప్రీమియర్ షోలకు పర్మిషన్ కూడా తెచ్చుకుంది. కానీ ఇప్పటివరకు ప్రీమియర్ షోలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు.
‘పుష్ప 2’ టీం ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ 4 రోజుల ముందే ఓపెన్ చేశారు. అందువల్ల వాటికి బుకింగ్స్ బాగా జరిగాయి. డే1 రికార్డు ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఈ విషయంలో ‘ఓజి’ టీం ప్లానింగ్ కరెక్ట్ గా లేదు అనే చెప్పాలి. లేదు అంటే వాళ్లకి ‘వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కంప్లీట్ అయ్యాకే ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేద్దాం’ అనే వేరే స్ట్రాటజీ ఏమైనా ఉండుండాలి.