‘డిజె టిల్లు’ ‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నుండి వచ్చిన సినిమా ‘జాక్’ (Jack). బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకుడు. ‘బేబీ’ తో టాప్ ప్లేస్ కి చేరుకున్న వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఇందులో హీరోయిన్. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(SVCC) బ్యానర్ అధినేతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 10న అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.42 cr |
సీడెడ్ | 0.13 cr |
ఉత్తరాంధ్ర | 0.20 cr |
ఈస్ట్ | 2.03 cr |
వెస్ట్ | 0.07 cr |
గుంటూరు | 0.10 cr |
కృష్ణా | 0.10 cr |
నెల్లూరు | 0.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.16 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.04 cr |
ఓవర్సీస్ | 0.11 cr |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 1.31 కోట్లు(షేర్) |
‘జాక్’ సినిమాకు రూ.14.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.1.31 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.06 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.14.19 కోట్ల షేర్ ను రాబట్టాలి.