సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాక్’ (Jack) చిత్రం నిన్న అంటే ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యింది. బేబీ (Baby) హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఇందులో హీరోయిన్ గా నటించింది. బాపినీడు, భోగవల్లి ప్రసాద్ (B. V. S. N. Prasad)..లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమాపై మొదటి నుండి హైప్ లేదు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. చాలా లో బజ్ తో .. మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి షోతోనే ఈ సినిమాకి యునానిమస్ గా నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాలోని లోపాలను ఎత్తి చూపుతూ చాలా మంది సోషల్ మీడియాలో తమకి తోచినట్టు డిస్కస్ చేసుకుంటున్నారు. ‘జాక్’ సినిమా కథ, కథనాలు ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేవు. ఇంకా చెప్పాలంటే చివరి వరకు ఆడియన్స్ థియేటర్లలో కూర్చునే విధంగా కూడా లేవు. ముఖ్యంగా సినిమాలో బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ ఎక్కడా కనిపించలేదు. ఇవి పచ్చి నిజాలు.
టీజర్, ట్రైలర్స్ చూసినప్పుడే.. ‘ఇవి ఇలా ఉన్నాయేంటి, ఎక్కడా ఆసక్తి కలిగించడం లేదు… సినిమా కనుక హిట్ అయితే సిద్ధు జొన్నలగడ్డ వల్లే హిట్ అవ్వాలి’ అంటూ అంతా అభిప్రాయపడ్డారు. బాగానే ఉంది. ఎవరి అభిప్రాయాలను తప్పుపట్టలేం. కానీ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినప్పుడు మాత్రం అంతా హీరోని వదిలేసి హీరోయిన్ వైష్ణవి చైతన్య పై పడుతున్నారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఎప్పటి నుండో ఉన్నదే. సినిమా హిట్ అయినప్పుడు హీరోకి క్రెడిట్ ఇస్తున్నప్పుడు.. సినిమా ఆడకపోతే హీరోయిన్ ను అనడం ఎంతవరకు కరెక్ట్.
‘జాక్’ లో వైష్ణవి స్క్రీన్ అప్పీరెన్స్ బాగుంది. ఆమె పాత్ర నిడివికి తగ్గట్టు బాగానే చేసింది. ఆమె క్యారెక్టర్ ఆర్క్స్ లోపించాయి. అది పూర్తిగా డైరెక్టర్ పై ఆధారపడి ఉంటుంది కదా.’జాక్’ సినిమాకి వైష్ణవి తన వరకు ఎంత చేయాలో అంతా చేసింది. సినిమా షూటింగ్ కోసం అడిగిన దానికంటే ఎక్కువ రోజులే కాల్షీట్స్ ఇచ్చింది. ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంది. ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా.. ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టింది లేదు. అయినా ఆమెనే నిందించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కాని ప్రశ్న..!