మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమంగా డబ్బులు లాగేసుకున్నారు అనే కేసులో కూడా ఆమె విచారణను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్‌తో సహా లంచం కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని 200కోట్ల దోపిడీ రాకెట్ కు సంబంధించిన ఇందులో ఉంది. ఇక ఆ కేసుకు మరోసారి సెప్టెంబర్ 25 న, జాక్వెలిన్ ఢిల్లీ అధికారుల ముందు హాజరుకానుంది. అంతకుముందు, ఆగస్టు 30 న, ఆమెను సుమన్ చంద్రశేఖర్‌పై ఇదే కేసులో దాదాపు 5 గంటలపాటు విచారించారు.
అయితే, ఈ కేసులో జాక్వెలిన్ నిందితుడిగా కాకుండా బాధితురాలిగా వ్యవహరించారని కూడా వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు గురించి కూడా జాక్వెలిన్ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. కావాలని కుట్ర చేశారని తెలిపింది. ఇక 200 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి సుకేష్ మరియు ఇతరులపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) దాఖలు FIR నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం, జాక్వెలిన్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయబడింది.
ఈ కేసులో చెన్నైలో ఉన్న ఒక విలాసవంతమైన బీచ్ బంగ్లా, రూ. 82.5 లక్షల నగదు, 2 కేజీల బంగారం, 16 లగ్జరీ కార్లు మరియు ఇతర హై ఎండ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆగస్టు 23న ED తెలిపింది.