Jagan, KCR: అనిల్ ఎఫ్3లో అలాంటి సీన్ ను ప్లాన్ చేశారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి కామెడీ ప్రధానంగా సినిమాలను తెరకెక్కిస్తూ ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2 సినిమాలు ఘనవిజయం సాధించాయి. అనిల్ దర్శకత్వం వహించిన ఎఫ్3 సినిమా ఈ ఏడాది మే నెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఎఫ్ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు సునీల్ కూడా కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్, సీఎం కేసీఆర్ కనిపిస్తారని బోగట్టా. ఎఫ్2 సినిమాతో పోలిస్తే ఎఫ్3 సినిమాలో ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. వరుణ్ తేజ్ కేసీఆర్, జగన్ లతో లంచ్ చేస్తున్నట్టు అనిల్ రావిపూడి ఒక సీన్ ను క్రియేట్ చేశాడని తెలుస్తోంది. ఈ సీన్ చాలా బాగా వచ్చిందని జగన్, కేసీఆర్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఈ సీన్ ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం దిల్ రాజు ఊహించని స్థాయిలో ఖర్చు చేశారని తెలుస్తోంది. తమన్నా, మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ ఇద్దరు హీరోయిన్లకు ప్రస్తుతం ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా ఎఫ్3 సినిమాతో ఆ హిట్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. అనిల్ రావిపూడి మాత్రం ఎఫ్3 సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అనిల్ రావిపూడి తర్వాత సినిమా బాలయ్య హీరోగా తెరకెక్కనుంది.

వెంకీ, వరుణ్ ఎఫ్3 సినిమాలో కామెడీ ట్రాకులతో కడుపుబ్బా నవ్వించనున్నారని సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్ రేచీకటితో, వరుణ్ తేజ్ నత్తితో బాధ పడుతూ ప్రేక్షకుల్ని మాత్రం నవ్విస్తారని తెలుస్తోంది. తెలుగులో సీక్వెల్ సినిమాలు ఎక్కువగా హిట్ కాలేదు. ఎఫ్3 సినిమా ఆ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus