భారీ ధరకు అమ్ముడు పోయిన జై లవకుశ శాటిలైట్ హక్కులు
- May 10, 2017 / 01:40 PM ISTByFilmy Focus
జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ 135 కోట్లు వసూలు చేయడంతో తారక్ స్టామినా ఏమిటో అందరికీ తెలిసొచ్చింది. అందుకే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జై లవకుశ థియేటర్ హక్కులను సొంతంచేసుకోవాలని 85 కోట్లు ఆఫర్ చేశారు. అయినా నిర్మాత కళ్యాణ్ రామ్ సున్నితంగా తిరస్కరించారు. ఎన్టీఆర్ సినిమాలకు బుల్లి తెరపైన కూడా మంచి రేటింగ్స్ వస్తున్నాయి. అందుకే సెట్ పై ఉండగానే జై లవకుశను కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నించాయి. అందులో ఓ తెలుగు ఛానల్ వాళ్ళు అత్యధికంగా 14 కోట్లు ఇవ్వడానికి ముందుకు రావడంతో నిర్మాత ఒకే చెప్పారు.
ఫస్ట్ లుక్ కూడా రాకముందే శాటిలైట్ హక్కులు అమ్ముడు పోవడం చూస్తుంటే ఈ మూవీపై ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతోంది. ఎన్టీఆర్ తొలిసారి త్రి పాత్రాభినయం చేస్తున్న జై లవకుశ ఫస్ట్ లుక్ ఈనెల 20 న రిలీజ్ అవుతుంది. హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్, బాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ సీ కే మురళీధరన్ తదితర టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1 న థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















