బంగ్లాల్లో మలుపు తిరగనున్న జై లవకుశ స్టోరీ
- May 9, 2017 / 11:34 AM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ సినిమా మూడో షెడ్యూల్ మొదలయింది. గుజరాత్ లోని ఓ అందమైన లొకేషన్లో వేసిన సెట్ లో పాట చిత్రీకరణ నిన్న ప్రారంభించారు. ఎన్టీఆర్, రాశీ ఖన్నాలపై తెరకెక్కిస్తున్నఈ పాటను మరో నాలుగురోజులపాటు చిత్రీకరించనున్నారు. అనంతరం చిత్ర బృందం హైదరాబాద్ కి రానుంది. ఇక్కడ కీలక సీన్లు షూట్ చేయనున్నట్లు సమాచారం. అందుకోసమే భారీ బంగ్లా సెట్ వేస్తున్నారు. ఈ సెట్ మరో రోజుల్లో పూర్తి కానుంది. తుది మెరుగులు దిద్దనున్నారు. ఇందులోనే కథ మలుపు తిరుగుతుందని చిత్ర యూనిట్ సభ్యుల్లో ఒకరు చెప్పారు.
ఎన్టీఆర్ పోషించే మూడు పాత్రలు ఈ బంగ్లాలో గొడవపడనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20 ) న విడుదల చేయాలని బాబీ ప్రయత్నిస్తున్నారు. మూడు క్యారెక్టర్స్ తో కూడిన లుక్ రివీల్ చేయాలా? వద్దా? అనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది. దానిపై త్వరలో నిర్ణయం తీసుకొని ఫస్ట్ లుక్ పనిలో పడనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















