జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ జై లవకుశ మూవీ చేస్తున్నారనే విషయం బయటికి వచ్చినప్పటి నుంచి ఆ చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది. తొలిసారి తారక్ మూడు పాత్రల్లో మెరవనుండడం అంచనాలను పెంచాయి. తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ గురించి తాజాగా ఓ విషయం బయటికి వచ్చింది. అది ఏమిటంటే జై లవకుశ కథను బాబీ ఎన్టీఆర్ కోసం రాయలేదంట. మాస్ మహా రాజ్ రవి తేజని దృష్టిలో ఉంచుకొని రాసినట్లు తెలిసింది. వీరిద్దరి కలయికలో వచ్చిన పవర్ సినిమా బ్లక్ బస్టర్ హిట్ కొట్టింది.
అయినా ఈ కథలో మూడు పాత్రలు చేయడానికి రవితేజ సంకోచించారని, అందుకే ఆ కథను రవితేజ చేయనున్నారని సమాచారం. సాహసంతో కూడిన స్టోరీని విన్న వెంటనే చేస్తానని ఎన్టీఆర్ ఒప్పుకున్నట్లు టాక్. నెగిటివ్ గా కూడా నటన ప్రదర్శించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కి జై లవకుశ స్టోరీ బాగా నచ్చిందని, వెంటనే అన్న కళ్యాణ్ రామ్ కి చెప్పి సినిమా పనులు మొదలు పెట్టారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సరైన హీరో వద్దకే స్టోరీ చేరిందని, ఆ కథకు ఎన్టీఆర్ ఇమేజ్, నటన తోడై అభిమానులను అలరించడం తధ్యమని అందరూ అభిప్రాయపడుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.