Jana Nayagan Vs NTR31: 2026 సంక్రాంతి.. బిగ్ ఫైట్ గ్యారెంటీనా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy)  చివరి సినిమాగా ‘జన నాయగన్’ (Jana Nayagan) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘దళపతి 69′(వర్కింగ్ టైటిల్) తో మొదలైన ఈ సినిమాకి హెచ్ వినోద్ (H. Vinoth) దర్శకుడు. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ (Venkat K. Narayana) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి స్పందన లభించింది. మొన్నామధ్య ఈ సినిమా 2025 అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు టాక్ నడిచింది.

Jana Nayagan Vs NTR31:

Jana Nayagan Movie to Clash with Jr NTR's NTR31 (1)

కానీ 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు ఫిల్మీ ఫోకస్ ఇది వరకే వెల్లడించింది. దాన్ని నిజం చేస్తూ.. ఈరోజు మేకర్స్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. 2026 జనవరి 9న ఈ చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ ని ‘మైత్రి’ లేదా దిల్ రాజు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు వినికిడి.

అంతా బాగానే ఉంది కానీ.. అదే రోజున అంటే జనవరి 9 నే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఎన్టీఆర్ 31′(వర్కింగ్ టైటిల్ డ్రాగన్) ను విడుదల చేయబోతున్నట్టు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా పాన్ ఇండియా సినిమానే. అయితే అనుకున్న టైంలో ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది అనే గ్యారెంటీ లేదు. ఒకవేళ కంప్లీట్ అయ్యి అదే రోజున రిలీజ్ చేయాలనుకుంటే.. రెండు సినిమాల ఓపెనింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

‘రాబిన్ హుడ్’ పై కొత్త అనుమానాలు.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus