మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తీసే డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. కొరటాల సినిమాలో డైలాగులు గుర్తుండి పోతాయి. మిర్చిలో .. వీలయితే ప్రేమిద్దాం డ్యూడ్ .. పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.., శ్రీమంతుడులో “ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి .. లేకపోతే లావుఅయిపోతారు” అనే డైలాగులు అందరికి భలే నచ్చాయి. అతని మూడో సినిమాలో ఇటువంటి మాటలకు కొదవలేదు. జనతా గ్యారేజ్ లో మనసుకు హత్తుకున్న డైలాగ్స్..
1. భాయ్ కోపం, నీ కోపం, నా కోపం .. తొక్కలో కోపాలు, నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నా.
2. భూమి మీద మనమందరం టెనట్స్ మాత్రమే.. నెక్స్ట్ జెనరేషన్ కి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేద్దాం.
3. మీ వాడు తప్పు చేసాడని మీకు తెలియదనే నమ్ముతున్నాను. కానీ అది మీకు తెలిసి పైకి ఇలా మంచి వాళ్లుగా నటిస్తున్నారని తెలిస్తే మీకు, జనతా గ్యారేజ్ కి, రెండింటికి రిపేర్ చేయాల్సి ఉంటుంది.
4. భగవంతుడు ఒకే జీవితంలో అన్నీ ఇవ్వడు. తనా ? జనతా గ్యారేజా ? జస్ట్ వన్ స్ట్రైట్ ఆన్సర్.
5. అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని, కొడుకుల్ని కొట్టేసిన.. ఇలాగే నిలబడగలను.
6. ఒక చెంప మీద కొట్టి అరిస్తే ఆర్గుమెంట్ గెలుస్తాం అనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. నో మోర్ పార్టీస్.
7. రేయ్ ఆనంద్, ఈ రోజు పండగరా.. అక్కడ ఇంకో ఇంట్లో పండగ జరగట్లేదమ్మా.
8. జనతా గ్యారేజ్ కన్నా కొడుకుని కూడా వదిలి పెట్టదు.
9. ఒకప్పుడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సచిన్ ఉంటే చాలు జట్టు గెలుస్తుందనే నమ్మకం ఉండేది. మీ ఆఫీసులో కూడా ఒక సచిన్ ఉన్నాడు. అతనికి సపోర్ట్ ఇవ్వండి. మిమ్మల్ని గెలిపిస్తాడు.