Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ‘బ్యూటీ స్పాట్స్‌ చెప్పు’ అని మెసేజ్‌ పెట్టిన హీరో ఎవరబ్బా?

జాన్వీ కపూర్‌… సినిమా పరిశ్రమలో ఆమెకున్న ఫాలోయింగ్‌ సపరేట్‌. సగటు హీరోయిన్‌కు ఆమెకు అస్సలు పోలిక లేదు. సోషల్‌ మీడియాలో జాన్వీకి ఉన్న క్రేజ్‌… ఇంకే హీరోయిన్‌కు కూడా ఉండదు. దానికి కారణాల్లో ఆమె అందం ఒకటైతే, రెండోది ఆమె ఫిజిక్‌. స్టార్‌ హీరోయిన్‌కి కావాల్సిన అన్ని రకాల హంగులు ఆమెకున్నా ఇంకా ఆ స్థాయికి రాలేదు. దానికి కారణం ఆమె సగటు కమర్షియల్‌ సినిమాలే కాకుండా మిగిలినవి కూడా చేస్తుండటం.

ఆ విషయం పక్కనపెడితే… జాన్వీలో బ్యూటీ స్పాట్స్‌ ఏంటి? అనే చర్చ ఇప్పుడు సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది. కారణం ఆమెనే. ఇటీవల ఓ టాక్‌ షోలో పాల్గొన్న జాన్వీ తన గురించి, తన ఫిజిక్‌ గురించి మాట్లాడింది. దాంతో ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కాఫీ విత్‌ కరణ్‌ టాక్‌ షోలో ఆసక్తికరమైన అంశం అంటే ర్యాపిడ్‌ ఫైర్‌. అందులోనే ఈ బ్యూటీ స్పాట్స్‌ టాపిక్‌ చర్చలోకి వచ్చింది.

ఏ హీరో అయినా నీకు కొంటె మెసేజ్‌లు పంపాడా? అని కరణ్‌ జోహర్‌ అడిగితే… ‘నీ బాడిలోని అన్ని బ్యూటీ స్పాట్స్ చెప్తావా’ అని ఒక హీరో మెసేజ్ పెట్టాడు అని జాన్వీ చెప్పింది. దానికి ‘అన్ని అంటే?’ అని ప్రశ్న కంటిన్యూ చేస్తే.. ‘అవును నాలో చాలా ఉన్నాయి’ అంటూ నవ్వేసింది. అవునా మరి అబ్బాయిలు నీలో మొదట చూసేది ఏంటి? అని అడిగితే ‘నా కళ్ళు బాగుంటాయి అని చాలా మంది చెబుతుంటారు అని చెప్పింది.

అయితే అబ్బాయిలు వాటికి అట్రాక్ట్‌ అవ్వకుండా వాల్ల చూపులు ఇంకెక్కడికో వెళ్తుంటాయి అంటూ కొంటెగా సమాధానం ఇచ్చింది జాన్వీ. దీంతో జాన్వీని ఆ ప్రశ్న అడిగిన హీరో ఎవరు అనే చర్చ ఓవైపు జరుగుతుంటే… ఆ బ్యూటీస్పాట్స్‌ ఏంటి అనే చర్చ మరోవైపు జరుగుతోంది. ఇక జాన్వీ సినిమాల సంగతి చూస్తే… చాలా ఏళ్లుగా వెయిట్‌ చేస్తున్న సౌత్‌ ఫ్యాన్స్‌కు ‘దేవర’ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus