తారక్‌ సినిమా ఛాన్స్‌పై జాన్వీ వైరల్‌ కామెంట్స్‌.. నిజమేనా అంటూ రియాక్షన్స్‌!

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు తొలి టాలీవుడ్‌ సినిమా ఎప్పుడు? తెలుగు సినిమా నాట ఈ మాట చాలా నెలలుగా వినిపిస్తూనే ఉంది. ఓసారి విజయ్‌ దేవరకొండ అని, మరోసారి ఎన్టీఆర్‌ అని.. ఇలా చాలా పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఏ సినిమా కూడా ఓకే అవ్వలేదు. అయితే ఎట్టకేలకు తారక్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ అయ్యింది. అయితే ఈ సినిమా విషయంలో జాన్వీ చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ సినిమా కోసం ఆమె రెగ్యులర్‌గా కొరటాల శివకు మెసేజ్‌లు చేసేవారట.

ఎన్టీఆర్‌ను ఎంతగానో అభిమానిస్తున్నట్లు చెప్పే జాన్వీ కపూర్‌ ఆయనతో పని చేసే అవకాశం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తారక్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేసే ఛాన్స్‌ వస్తే బాగుండని ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాను కూడా. రోజూ దేవుణ్ని ఇదే విషయం కోరుకునేదాన్ని కూడా. ఫైనల్‌గా నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నాను. షూటింగ్‌లో జాయిన్‌ అవ్వడం కోసం దర్శకుడికి రోజూ మెసేజ్‌లు పెడుతున్నా అని చెప్పింది జాన్వి.

అంతేకాదు ఇటీవల మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూశాను అని కూడా చెప్పింది. ఆ సినిమాలో తారక్‌ అందం, ఉత్సాహం మరోస్థాయిలో ఉంటాయి అంటూ పొగిడేసింది కూడా. అయితే ఆమె కామెంట్స్‌ విషయంలో కొంతమంది అభిమానులు మరో రకంగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లూ సినిమాను ఓకే చేయకుండా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. తారక్‌ 30వ సినిమాలో ఆలియా భట్‌ను తొలుత అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె దూరమయ్యారు.

ఆ సమయంలోనే సినిమాలోకి జాన్వి వస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఏమైందో ఏమో.. ఇంకా ఫైనల్‌ అవ్వలేదు అంటూ వార్తలొచ్చాయి. మధ్యలో జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ కూడా ఈ సినిమా ఆఫర్‌ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు చూస్తే దేవుణ్ని మొక్కుకున్నా అని జాన్వీ చెబుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus