Janhvi Kapoor: తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణమిదే: జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకోవాలని అడుగులు వేస్తోంది. ఈ బ్యూటీ ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా సక్సెస్ కాకోయినప్పటికీ కూడా అమ్మడికి మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కొంతమంది ప్రముఖ నిర్మాతలు కూడా ఈ బ్యూటీ కోసం ప్రత్యేకంగా సినిమాలను రూపొందిస్తున్నట్లు వస్తోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా అమ్మడికి గతంలో చాలా సార్లు ఆఫర్స్ వచ్చాయి.

తమిళంలో కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు సౌత్ సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను చెప్పింది. ఇప్పటివరకు తనకు నచ్చిన పాత్రలు అంతగా రాలేదు అని చాలా ఆఫర్స్ వస్తున్నప్పటికీ కూడా చేయకపోవడానికి ప్రధాన కారణం సరైన కథలో రాకపోవడమేనని తెలియజేసింది. మంచి సినిమాలతోనే తెలుగు తమిళ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనిపిస్తోంది అని పాత్రలు కథలు నచ్చితే తప్పకుండా సౌత్ ఇండస్ట్రీలో నటించడానికి ఒప్పుకున్నానని చాలా ఓపెన్ గా తెలియజేసింది.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ కోసం కొంతమంది టాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. జాన్వి కపూర్ కూడా వీలైనంత త్వరగా తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా చేయాలని చూస్తోంది. మరి ఈ బ్యూటీ మొదట ఏ హీరోతో నటిస్తుందో చూడాలి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus