Janhvi Kapoor: హీరోయిన్ పెయింటింగ్ స్కిల్స్.. నెటిజన్లు ఫిదా!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి నుండి కూడా ఆమె రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా సరికొత్త పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘రూహి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది.

ఇందులో ఆమె పెయింటింగ్ చేస్తూ కనిపించింది. తను పెయింట్ చేసిన కొన్ని బొమ్మలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ”నన్ను నేను పెయింటర్ అని పిలుచుకోవచ్చా..?” అంటూ ప్రశ్నించింది. జాన్వీ పెయింటింగ్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ అందాల బొమ్మలో ఇంత అందమైన పెయింటింగ్స్ వేసే టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి శ్రీదేవికి కూడా ఆర్ట్ పెయింటింగ్ వేయడమంటే చాలా ఇష్టం. తనకు సమయం దొరికినప్పుడల్లా శ్రీదేవి పెయింటింగ్స్ వేసేవారు.

ఇప్పుడు తల్లి మాదిరి కూతురు కూడా పెయింటింగ్ హాబీగా చేసుకుంది. ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్ లో ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే చాలా కాలంగా జాన్వీను టాలీవుడ్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం జాన్వీనే హీరోయిన్ గా తీసుకుంటారని టాక్ నడుస్తోంది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus