ఆస్కార్ అవార్డ్ ఉత్సాహంలో తారక్ అలా చేయనున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా ఇప్పటికే రిలీజైన జాన్వీ కపూర్ లుక్ ప్రేక్షకులకు తెగ నచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ లుక్ కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని సమాచారం అందుతోంది. కొరటాల శివ తారక్ లుక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని బోగట్టా.

ఆస్కార్ అవార్డ్ రావడంతో తారక్ మరింత ఉత్సాహంతో ఈ సినిమా కోసం పని చేస్తున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించడం కోసం రేయింబవళ్లు షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా షూట్ లో పాల్గొనడానికి జాన్వీ తెగ ఆసక్తి చూపిస్తున్నారని బోగట్టా. జాన్వీ తారక్ జోడీ సూపర్ గా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా స్క్రిప్ట్ విషయంలో తారక్ కూడా జోక్యం చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా మరింత మెరుగ్గా ఉండటానికి తారక్ ఎన్నో సూచనలు చేశారని బోగట్టా. పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావడంతో పాటు మరిన్ని సక్సెస్ లను అందుకొని కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి హీరోలతో కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. విదేశాల్లో కూడా తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus