Janhvi Kapoor: ఎక్కడికెళ్లినా అదే మాట అనేవారట… దీంతో చేసేదేం లేక: జాన్వీ వైరల్‌ కామెంట్స్‌.!

హీరో కొడుకు హీరో అవ్వాలి, హీరోయిన్‌ కూతురు హీరోయిన్‌ అవ్వాలి అని ఎక్కడైనా రూల్‌ ఉందా? మామూలుగా అయితే ఎక్కడా ఉండదు. అయితే సినిమా పరిశ్రమకు చెందినవారి గురించి చాలామంది ఇలానే అనుకుంటూ ఉంటారు. అయితే అలా వచ్చాక నెపోటిజం అంటూ మళ్లీ రాళ్లు విసిరేది వాళ్లే. ఈ రెండు సినారియోలు క్లియర్‌గా మీకు అర్థమవ్వాలంటే జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) గురించి తెలుసుకోవాల్సిందే. ఆమెకు ఏముంది తల్లిదండ్రుల వారసత్వంతో వచ్చేసింది అని మీరు అనొచ్చు.

మీరు అన్నది కరెక్టే ఆమె అలానే వచ్చింది. అయితే ఆమెకు వేరే ఛాన్స్‌ కూడా లేకపోయిందట. జాన్వీ చిన్నతనంలో సినిమాల వైపు రాకుండా చేయాలని శ్రీదేవి (Sridevi) చాలా ప్రయత్నాలు చేశారట. ఆమెను వైద్యురాలిగా చూడాలి అనేది ఆమె కోరిక. అందుకు తగ్గట్టుగా చిన్నతనం నుండి జాన్వీ గ్లామర్‌ వరల్డ్‌ వైపు రాకుండా చాలా ఏర్పాట్లు చేసింది శ్రీదేవి. అయితే జాన్వీకి మాత్రం సినిమాల్లోకి రావాలి అని అనిపించేదట. కానీ శ్రీదేవి నో అనేవారట. ఆమెనే కాదు..

జాన్వీ ఎక్కడికెళ్లినా ‘నువ్వేం అవుతావ్‌’ అనే ప్రశ్న కాకుండా ‘నువ్వు హీరోయిన్‌ అవుతావులే, శ్రీదేవి కూతురు కదా’ అనేవారట. దీంతో ఆ రోజుల్లో జాన్వీ నిజ జీవితంలో కూడా నటించిందట. ఎవరైనా తన కెరీర్‌ గురించి, భవిష్యత్తులో ఏమవుతావు అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా అమ్మ కోసం నేను వైద్యురాలిని అవుతా అని కొన్నిసార్లు, వాళ్లు అన్నదే కరెక్ట్‌ అని మరికొన్నిసార్లు యాక్ట్‌ చేసేసేదట. అయితే మనసులో మాత్రం హీరోయిన్‌ అవ్వాలని అనుకునేదట.

అయితే మనసులో అనుకున్నదే ఇప్పుడు జరిగింది అనుకోండి. ఇక తను ప్రస్తుతం లవర్‌ శిఖర్‌తో ప్రేమలో చాలా ఆనందంగా ఉన్నా అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇక జాన్వీ సినిమాల గురించి చూస్తే ప్రస్తుతం ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి’ (Mr. & Mrs. Mahi) థియేటర్లలో రన్‌ అవుతూ మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఎన్టీఆర్‌తో (Jr NTR) ‘దేవర’లో (Devara) తంగమ్‌గా కనిపించబోతోంది. మరోవైపు రామ్‌చరణ్‌ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమాను ఓకే చేసేసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus