Janhvi Kapoor: ఆ నొప్పి భరించలేక పెయిన్ కిల్లర్స్ కూడా వాడాను: జాన్వీ కపూర్

నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజులుగా ఈమె నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా ఓటీటీలో విడుదలయ్యే మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె నటించిన మిల్లి సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాని తమిళ చిత్రం హెలెన్ కి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ కపూర్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో తాను మైనస్ 16 డిగ్రీల చలిలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా నటించాల్సి వచ్చిందని దీనికోసం తాను చాలా కష్టపడ్డానని ఈమె తెలిపారు. ఈ సినిమా కోసం 7.5 కిలోల బరువు కూడా తగ్గానని జాన్వీ కపూర్ వెల్లడించారు.

ఈ సన్నివేశాలలో నటించడానికి తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలంటే ఇలాంటి పాత్రలలో నటించడం తప్పనిసరి అని ఈమె వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలో ఈ సన్నివేశాలలో నటించిన తర్వాత రాత్రి పడుకున్నా కూడా అవే కలలో కనిపించేవని, ఆ సమయంలో ఆ నొప్పులను భరించలేక పెయిన్ కిల్లర్ మాత్రలు మూడు రోజులపాటు వేసుకున్నానని

ఈ సందర్భంగా జాన్వి కపూర్ తన మానసిక పరిస్థితి గురించి తెలియజేశారు.అయితే మనం ఏ పని చేసినా ఏ ఇండస్ట్రీలో పనిచేసిన నిజాయితీగా పని చేస్తేనే మనం చేసిన పనికి ప్రతిఫలం దక్కుతుందని ఈ సందర్భంగా నటి జాన్వీ కపూర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus