Devara: రివర్స్ స్క్రీన్ ప్లేతో దేవర.. ఫస్టాఫ్ లో ఆ సాంగ్స్ మాత్రమే ఉంటాయా?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  , కొరటాల శివ (Koratala Siva)  కాంబో మూవీ దేవరలో  (Devara) రివర్స్ స్క్రీన్ ప్లే ఫాలో అవుతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సాధారణంగా సినిమాల్లో హీరో తండ్రీకొడుకు పాత్రల్లో కనిపిస్తే మొదట కొడుకు పాత్రను పరిచయం చేసి ఆ తర్వాత తండ్రి పాత్రను పరిచయం చేయడం జరుగుతుంది. అయితే దేవర మూవీ ఫస్టాఫ్ దేవర పాత్ర ప్రధానంగా ఉండనుందని సమాచారం అందుతోంది.

Devara

ఫియర్ సాంగ్, ఆయుధ పూజ సాంగ్ సినిమాలో ఫస్టాఫ్ లో ఉంటాయని చుట్టమల్లే సాంగ్ సెకండాఫ్ లో ఉంటుందని భోగట్టా. సెకండాఫ్ లో జాన్వీ (Janhvi Kapoor)  పాత్ర ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు(R. Rathnavelu) చేసిన కామెంట్ల ద్వారా ఈ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం కొసమెరుపు. జాన్వీ కపూర్ పాత్ర కథలో కీలకమని కేవలం గ్లామర్ కోసం మాత్రమే జాన్వీ కపూర్ పాత్ర కాదని సమాచారం అందుతోంది.

దేవరకు హైలెట్ గా కనిపించే షాట్స్ ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. డైలాగ్స్ విషయంలో కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. కొరటాల శివకు ఈ సినిమాతో తనకు పూర్వ వైభవం వస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కొరటాల శివ ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకోవాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

కొరటాల శివ ఈ సినిమా కోసం దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కష్టపడ్డారని సమాచారం అందుతోంది. రివర్స్ స్క్రీన్ ప్లే దేవరకు ఎంతమేర ప్లస్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండు వారాల పాటు దేవర మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ అయితే లేదనే సంగతి తెలిసిందే. కొరటాల శివ దేవర సినిమా తర్వాత మలయాళం ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు. దేవర సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. దేవర సినిమా ఫ్యాన్స్ ను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

 ‘సై’ కి 20 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus