కొత్త సంవత్సరంలో మొదటి నెల అయిపోయింది. అంటే టాలీవుడ్‌కి (Tollywood ) ఓ ముఖ్యమైన నెల అయిపోయింది. తెలుగు సినిమాకు అతి ముఖ్యమైన ఈ నెల ఎలా సాగింది, సినిమాలు ఎలాంటి ఫలితాలు అందించాయో ఓసారి చూద్దాం. ఎప్పటిలాగే పదికిపైగా సినిమాలొస్తే విజయాలు ఒకటో, రెండో వచ్చాయి. అయితే వచ్చిన ఆ ఒక్క విజయం కూడా సెంట్ పర్సెంట్‌ది కావడం గమనార్హం. సంక్రాంతి సీజన్ ముందుంది అనో, అప్పుడే మొదలైందిగా సంవత్సరం ఎందుకనో ప్రతి సంవత్సం తొలి వారం పెద్దగా కొత్త సినిమాలు ఉండవు.
Tollywood
ఈసారి కూడా అదే పరిస్థితి. ‘డ్రీమ్ క్యాచర్’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ’, ‘కథా కమామిషు’, ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ లాంటి సినిమాలొచ్చాయి. ఈ సినిమాలు వచ్చాయి వెళ్లాయి అనే విషయం కూడా చాలామంది తెలియదు. రెండో వారం సంక్రాంతి సందడి మొదలైంది. తొలి సినిమా జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అంటూ రామ్‌చరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) వచ్చారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పాత వాసనలు, కొన్ని కుట్రలు (?) కారణంగా వెనుకబడిపోయింది.
పెట్టిన డబ్బులు కూడా రాకపోగా.. తొలి రోజు వసూళ్ల పోస్టర్‌తో ట్రోలింగ్ బారిన పడింది. అక్కడికి రెండు రోజులకు అంటే జనవరి 12న వచ్చిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) తొలి రోజు టాక్, హైప్ బాగానే వచ్చాయి. కానీ అది రెండ్రోజులకే పరిమితమైంది. కానీ జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒక్కో థియేటర్ / స్క్రీన్ ఈ సినిమాకు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత ‘డాకు మహారాజ్’ టీమ్ నుండి కూడా పెద్దగా ఎక్కడా సందడి కనిపించలేదు. మొత్తంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ హడావుడే కనిపిస్తోంది.
దీంతో ఈసారి విజేత వెంకటేశే (Venkatesh Daggubati) అని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వందకు వంద మార్కులు కొట్టేశారు మరి. ఇక మూడో వారం వచ్చేసరికి సంక్రాంతి ఫీవర్ కారణంగా పెద్ద సినిమాలు లేవు. వచ్చిన చిన్న సినిమాలూ ఆడలేదు. ‘వైఫ్ ఆప్’, ‘డియర్ కృష్ణ’, ‘హత్య’, ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu), ‘తల్లి మనసు’ లాంటి సినిమాలు వచ్చాయి. వీటిలో ‘గాంధీ తాత చెట్టు’ ఒకటే కాస్త జనాలను ఆకట్టుకుంది. మిగిలిన వాటి సంగతి సరేసరి. ఇవి కాకుండా మరికొన్ని చిన్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.