టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR) జపాన్ లో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ సినిమాలకు జపాన్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. తారక్, చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ (RRR) జపాన్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం. తారక్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో బృందావనం (Brindavanam) ఒకటి అనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు థమన్ (S.S.Thaman) మ్యూజిక్ అందించగా సినిమాలోని చిన్నదోవైపు పెద్దదోవైపు సాంగ్ మాస్, క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కటౌట్ కు మెడలో దండ వేసి పూలు చల్లుతూ జపాన్ లేడీ ఫ్యాన్స్ బృందావనంలోని పాటకు డ్యాన్స్ చేసిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన అభిమానులు వీళ్లు వేరే లెవెల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తారక్ పుట్టినరోజును ఇంత గ్రాండ్ గా జపాన్ లో కూడా జరుపుకోవడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఇండియాకు వచ్చి వరుస షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో దేవర సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. దేవర (Devara) సినిమా భారీ లెవెల్ లో ఉండబోతుందని కొరటాల శివ (Koratala Siva) ఆసక్తికర కథనంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రధానంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ ను పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తారక్ భవిష్యత్తులో తన సినిమాలను బాలీవుడ్ లో సైతం రికార్డ్ స్థాయిలో థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్స్ ఉన్నాయని సమాచారం అందుతోంది. తారక్ ప్రతి సినిమా 300 కోట్ల రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.