సుధీర్ బాబు హీరోగా ‘జటాధర’ అనే సినిమా రూపొందింది. పలు షార్ట్ ఫిలిమ్స్ కి డైరెక్ట్ చేసి.. తర్వాత ‘రాక్షస కావ్యం’ అనే సినిమాకి ఎడిటర్ గా పనిచేసిన వెంకట్ కళ్యాణ్ ‘జటాధర’ తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రేరణ అరోరా,ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. లంకె బిందెలు, పిశాచ బంధనం కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. దీనికి మైథలాజికల్ టచ్ కూడా ఇచ్చారు. టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. కాకపోతే ఎందుకో వాటిల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే మైథలాజి కాన్సెప్ట్ సినిమాలకి కొన్నాళ్ల నుండి థియేటర్స్ లో కాసుల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ‘జటాధర’ కి కూడా ఆ అడ్వాంటేజ్ ఉండేది. కానీ ఈ సినిమాకి సరైన విధంగా ప్రమోషన్ జరగలేదు. బజ్ క్రియేట్ కాలేదు. సినిమా రిలీజ్ అవుతున్నట్టు చాలా మందికి తెలీదు. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘జటాధర’. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది జనాలకి స్పెషల్ షో వేశారు మేకర్స్. వారి టాక్ ప్రకారం.. ‘జటాధర’ సినిమా 2 గంటల 15 నిమిషాల నిడివి కలిగి ఉందట.

ధన పిశాచి ఉన్న ఓ ఇంట్లోకి ఓ భార్యాభర్తలు రావడం.. వాళ్ళని ధనంపై మొహం కలిగిన ఆ భార్యని ధన పిశాచి లొంగదీసుకోవడం. అందుకోసం బలికోరడం.. అందుకోసం ఓ చిన్న పిల్లాడిని బలికి సిద్ధం చేయడం. మరోపక్క కుటుంబ సభ్యులకు తెలియకుండా గోస్ట్ హంటింగ్ చేసే హీరో… అతనికి పసి పిల్లాడు కలలోకి రావడంతో ఆ ఊరికి వెళ్లడం..? క్లైమాక్స్ లో ఆ ధన పిశాచిని ఎలా అంతం చేశాడు? అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు కొట్టిపారేసే విధంగా ఉన్నాయట. క్లైమాక్స్ లో శివుడి ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
