రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా తెరకెక్కింది. ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి ఇందులో హీరోగా చేసినప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ వంటి మరో హీరోయిన్ కూడా ఉన్నప్పటికీ.. రష్మిక మందన్న ఇమేజ్ పైనే ఈ సినిమా మార్కెట్ అయ్యింది. రాహుల్ రవీంద్రన్ 6 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ ని డైరెక్ట్ చేశారు. ‘చి ల సౌ’ సినిమాతో అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా పేలలేదు. ఆ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరిలో నేషనల్ అవార్డుని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చేసిన ‘మన్మథుడు 2’ డిజాస్టర్ గా మిగిలింది.
అయినప్పటికీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ ని రాహుల్ ఎంతో కసిగా తీసినట్టు నిర్మాతలు చెప్పుకొచ్చారు. నవంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో 2 రోజుల ముందే ప్రిమియర్స్ వేశారు. సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం… ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా స్టార్ట్ అయ్యిందట. రష్మిక ఇంట్రో, దీక్షిత్ క్యారెక్టర్ బిల్డింగ్, దుర్గ పాత్ర చేసిన అను ఇమ్మాన్యుయేల్ పాత్ర అన్నీ కూడా బాగా డిజైన్ చేశారట.

ఇంటర్వెల్ కి ముందు వచ్చే రోహిణి పాత్ర ఇందులో కూడా చాలా కీలకంగా ఉంటుందట. సెకండాఫ్ స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటుందట. ఒక దశలో థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ మొత్తం సినిమాలో ఉన్న పాత్రలతో ముఖ్యంగా భూమా(రష్మిక) పాత్ర ఇంటెన్సిటీకి గురిచేస్తుంది అని తెలుస్తుంది. క్లైమాక్స్ కూడా బాగా పేలిందట. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సెన్సిబిలిటీస్ ఈ సినిమాలో పుష్కలంగా కనిపించినట్టు అంతా చెబుతున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో..!
