జాతిరత్నాలకు అమెజాన్ అంత ఆఫర్ చేసిందా..?

  • March 26, 2021 / 08:25 PM IST

ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు కథ, కథనంలో ఎన్ని లోపాలు ఉన్నా ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్న సినిమాలను ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. కథ పెద్దగా లేకపోయినా తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండటం వల్లే జాతిరత్నాలు సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించింది. కొత్త సినిమాలు ఎన్ని విడుదలవుతున్నా జాతిరత్నాలు హవా తగ్గడం లేదు. ఈ రోజు విడుదలైన రంగ్ దే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జాతిరత్నాలు సినిమాకు కలెక్షన్లు తగ్గుతాయేమో తెలియాల్సి ఉంది.

ఇప్పటివరకు ఈ సినిమా 36.17 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు వస్తున్నాయని సమాచారం. మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కుల కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమా వచ్చే నెల 10వ తేదీ నుంచి వస్తుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. జాతిరత్నాలు నిర్మాత నాగ్ అశ్విన్ కు ఈ సినిమా హక్కుల ద్వారా భారీగా లాభాలు వస్తున్నాయి.

జాతిరత్నాలు రీమేక్ హక్కులకు కూడా భారీగా డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమా విడుదలకు ముందు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ఓటీటీలో మాత్రమే విడుదల చేయడానికి 18 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని భావించి థియేటర్లలోనే రిలీజ్ చేశారని సమాచారం.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus