బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘జవాన్’. సెప్టెంబర్ 7న హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కథలో కొత్తదనం లేకపోయినా.. షారుఖ్ ను అట్లీ ప్రజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుందని చెబుతున్నారు.
యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ ఎలిమెంట్స్ .. సినిమాలో బోలెడన్ని ఉన్నాయి అని అంటున్నారు. ఇక మొదటి రోజు సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ అదిరిపోయాయి అని చెప్పాలి.మొదటి వారం భారీగా కలెక్ట్ చేసిన జవాన్.. రెండో వీకెండ్లో కూడా అదరగొట్టేసింది.వినాయక చవితి సెలవు కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
6.21 cr
సీడెడ్
2.83 cr
ఉత్తరాంధ్ర
3.60 cr
ఈస్ట్
1.57 cr
వెస్ట్
1.44 cr
గుంటూరు
1.98 cr
కృష్ణా
2.03 cr
నెల్లూరు
1.33 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
20.99 cr
‘జవాన్’ (Jawan) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.20.99 కోట్ల షేర్ ను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.16.14 కోట్ల భారీ లాభాలను అందించింది ఈ సినిమా.