Yamini Swetha: ‘జయం’ ఫేమ్ యామిని శ్వేత ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది?

దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం’ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 2002 వ సంవత్సరం జూన్ 14న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ‘చిత్రం మూవీస్’ బ్యానర్ పై దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా జరిగింది. ఈ చిత్రంలో నితిన్ అమాయకపు నటన.. పక్కింటి అమ్మాయిలా కనిపించే సదా లుక్స్, గోపీచంద్ విలనిజం, ఆర్పీ పట్నాయక్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ హైలెట్టే..! ఈ చిత్రం ఘన విజయం సాధించి బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు లాభాలను అందించింది.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో హీరోయిన్ సదా చెల్లెలి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన అక్క ప్రేమ గెలవాలని ఈ పాప చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా అక్షరాలను తిరగేసి రాస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఈ పాత్రకి గాను ఆ పాపకి నంది అవార్డు లభించింది. ఆ పాప యామిని శ్వేత. ఈ చిత్రం వచ్చి 20 ఏళ్ళు అయ్యింది కదా మరి ఈ పాప ఎక్కడుంది? ఏం చేస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు.

ఈమె ప్రముఖ సీరియల్‌ ఆర్టిస్ట్‌ జయలక్ష్మి కూతురు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ‘జయం’ చిత్రం కంటే ముందుగా దాదాపు 10 సీరియల్స్‌ నటించింది.అలాగే ‘జయం’ తర్వాత ‘ఉత్సాహం’, ‘అనగనగా ఓ కుర్రాడు’ వంటి చిత్రాల్లో కూడా చేసింది.అటు తర్వాత ఈమె సినిమాల్లో కనిపించలేదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఈమె అక్కడ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసింది.

అటు తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈమెకి ఓ పాప కూడా ఉంది. ఇక ఈమె చదువుకుంటున్న టైములో ‘నచ్చావులే’ వంటి సినిమాల్లో కూడా ఈమెకి అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించింది యామిని. ఇక నంది అవార్డుకు వచ్చిన రెమ్యునరేషన్‌ను కూడా మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus