Jeevitha Rajasekhar: మోహన్ బాబు-రాజశేఖర్ విషయంపై జీవిత క్లారిటీ!

రీసెంట్ గా మంచు విష్ణు మీడియా ముందు ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ‘మొన్న రాజశేఖర్ మా నాన్నగారి దగ్గరకు వచ్చి.. ఏం మాట్లాడారో తెలుసా..?’ అంటూ విష్ణు కోపంగా ఏదో చెప్పబోతుంటే నరేష్ అడ్డుపడి కంట్రోల్ చేశాడు. ఆ తరువాత విష్ణు ఆ మాటని దాటేశాడు. అప్పటినుంచి మోహన్ బాబు ఇంటికి రాజశేఖర్ ఎందుకు వెళ్లాడు..? ఏం మాట్లాడుకున్నారనే విషయంపై ఆసక్తి మొదలైంది.

నిజానికి రాజశేఖర్.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం అనేది మాములు విషయమే. అయితే ఇప్పుడు విష్ణు ప్యానెల్ వేరు, జీవితా రాజశేఖర్ ప్యానెల్ వేరు. అందుకే రాజశేఖర్.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం కాస్త ఆసక్తికరంగా మారింది. పైగా విష్ణు ఆవేశంతో రెచ్చిపోవడం, నరేష్ ఆపడం చూసి విషయం ఏదో పెద్దదై ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై జీవిత క్లారిటీ ఇచ్చేశారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోందని రాజశేఖర్ అక్కడకు వెళ్లే దారిలో మోహన్ బాబు ఇల్లు ఉందని ఆయన్ని వెళ్లి కలిశారు. బయట అనవసరమైన పుకార్లు వస్తున్నాయని.. ఎందుకిన్ని గొడవలు, కలిసి మాట్లాడుకుంటే సరిపోతుంది కదా.. అని చెప్పడానికే రాజశేఖర్ వెళ్లారని జీవిత క్లారిటీ ఇచ్చారు. అంతకుమించి ఏం లేదని.. దాన్ని హైడ్రామాగా సృష్టించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus