తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. ‘ట్రిపులార్’ రిలీజ్ అయ్యి 8 నెలలవుతున్నా ఇంకా అదే జోష్‌లో ఉన్నారు. ఇటీవల హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఇప్పటికే పలు ప్రశంసలు, పురస్కారాలు పొందుకున్నజక్కన్నకు మరో అరుదైన గౌరవం దక్కింది. పాపులర్ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఈ సారి బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళికి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు NYFCC తెలిపింది.
ఎంతో మంది హాలీవుడ్ డైరెక్టర్లను తలదన్ని జక్కన్న ఈ ఘనత సాధించడం విశేషం. ‘‘స్టూడెంట్ నెం.1’ నుండి ‘ఆర్ఆర్ఆర్’ వరకు.. ఎక్కడ మొదలై.. ఎక్కడి వరకు వచ్చింది జక్కన్న జర్నీ’’ అంటూ ప్రేక్షకులు జక్కన్నని ప్రశంసిస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనతో నాలుగు అద్భుతమైన చిత్రాలు చేసిన జక్కన్నను ప్రశంసిస్తూ తారక్ ట్వీట్ చేశాడు..
‘‘కంగ్రాచ్యులేషన్స్ జక్కన్న.. ఈ నీ జర్నీ కేవలం ఆరంభం మాత్రమే.. ఇంకా ఎంతో ఉంది.. నాకు నీ గురించి అంతా తెలుసు… ఇప్పుడు ప్రపంచం తెలుసుకోబోతోంది’’ అంటూ ట్వీట్ చేశాడు.. ఎన్టీఆర్ ట్వీట్‌లో చిన్న మార్పు చేశారు రాజమౌళి.. ‘‘అది నా జర్నీ కాదు.. మన జర్నీ.. మన జర్నీకి ఇది ఆరంభం మాత్రమే’’ అని జక్కన్న నవ్వుతూ రీ ట్వీట్ చేశారు. Your లో ముందు Y తీసేసి our అని అర్థం చెప్పిన జక్కన్నది మాస్టర్ మైండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
రాజమౌళి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పి ప్రేక్షకాభిమానులకు కిక్ ఇచ్చారు. తనకు ఇండియానా జోన్స్ ఫ్రాంఛైజీ మూవీస్ అంటే చాలా ఇష్టమని.. ఆ టైప్ సినిమా చేయాలని ఉందని.. మహేష్ బాబుతో అలాంటి చిత్రమే చేయబోతున్నానని రివీల్ చేసి.. అంచనాలు పెంచేశారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథ రెడీ చేశారని.. ప్రస్తుతం దాని డెవలప్‌మెంట్ వర్క్ జరుగుతుందని అన్నారు..