Jr NTR: ఎన్టీఆర్ బ్యానర్ లో ఫస్ట్ సినిమా ఆ హీరోతోనేనా!

సినిమా రంగంలో స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించినటువంటి ఎంతో మంది హీరోలు అనంతరం నిర్మాణ రంగంలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది యంగ్ హీరోలు అందరూ నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మిస్తున్నారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొనిదెల ప్రొడక్షన్ స్థాపించడమే కాకుండా తాజాగా వి మెగా ప్రొడక్షన్ హౌస్ కూడా స్థాపించి నిఖిల్ తో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.

అదేవిధంగా ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్ కూడా నిర్మాణ సంస్థను స్థాపించి ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. రామ్ చరణ్, కళ్యాణ్ రామ్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి ఈయన కూడా కొత్తవారికి అవకాశాలను కల్పించాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈయన త్వరలోనే తన బ్యానర్ ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

ఈ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన అన్ని విషయాలను ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ నిర్మాణ సంస్థను స్థాపిస్తే ఈయన మొదటి సినిమాని ఎవరితో చేస్తారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అయితే ఎన్టీఆర్ తన ప్రొడక్షన్ హౌస్ లో మొట్టమొదటి సినిమాని నాచురల్ స్టార్ నానితో చేయబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఎన్టీఆర్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ (Jr NTR) సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా ఈయన నటించబోతున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus