స్టార్ హీరో అభిమానులు తమ హీరో కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. తమ హీరో గొప్ప అని చెప్పడం కోసం అనేక పనులు చేస్తుంటారు. ఆ హీరో పేరున వారు చేసే కార్యక్రమాలు కొన్ని సార్లు సమాజ హితం కొరకు పనికొస్తాయి. అలాగే ఫ్యాన్స్ పేరుతో వారు చేసే చర్యలు కొన్ని సార్లు విపరీతాలకు దారి తీస్తుంటాయి. ఐతే సంక్రాంతి పండుగ సంధర్భంగా టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ అభిమానులు చేసిన ఓ పని కొంచెం ఓవర్ అనిపించింది. ఇది మరీ ఓవర్ రా బాబు.. అని అందరూ అనుకుంటున్నారు. విషయంలోకి వెళితే ఎన్టీఆర్ అభిమానులు ఆంద్రప్రదేశ్ సచివాలయంలో సీఎం కుర్చీలో కూర్చొని ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ముందు నందమూరి తారక రామారావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అనే నేమ్ ప్లేట్, టేబుల్ పై ఎన్టీఆర్ విగ్రహం మొత్తం సెటప్ తో ఎన్టీఆర్ ని సీఎం చేశేశారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ 2024 సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ సంక్రాంతి శుభాకాంక్షలతో ఫ్లెక్స్ లు కట్టారు. 2009 తరువాత జరిగిన పరిణామాల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ని ఏకంగా 2024 సీఎం ని చేసేయడం వింతగా ఉంది. అలాగే ఎన్టీఆర్ అభిమానులు మరియు టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. గత ఎన్నికలలో టీడీపీ ఎదురైన ఘోర పరాభవం తరువాత టీడీపీ వర్గం ఫోకస్ ఎన్టీఆర్ పైకి మళ్లింది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీ ని కాపాడగలడనే నమ్మకం వారిలో బలపడింది. ఏదిఏమైనా సీఎం గా ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫోటో అభిమానులలో జోష్ నింపుతుంటే..యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ ఆనందిస్తున్నారు.