NTR, Trivikram: ఆ ప్రాజెక్ట్ కు తారక్ ఓకే చెప్పి ఉంటే బాగుండేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ దాదాపుగా ఒకే సమయంలో మొదలైంది. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో సాధ్యమైంది. అటు ఎన్టీఆర్ అభిమానులను ఇటు త్రివిక్రమ్ అభిమానులను మెప్పించేలా ఈ సినిమా తెరకెక్కింది. అరవింద సమేత సినిమాలోని ఫైట్ సీన్లకు తారక్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఈ సినిమాలో తారక్ డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంటుంది. నాలుగున్నర సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలను సైతం త్రివిక్రమ్ అద్భుతంగా డీల్ చేస్తారని ప్రూవ్ అయింది. ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ కాగా ఆ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ అయిందని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి.

అయితే ఏం జరిగిందో తెలీదు కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు ప్రకటన వెలువడింది. ఒకవేళ ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యి ఉంటే ఆర్ఆర్ఆర్ విడుదలైన వెంటనే షూట్ మొదలై ఈపాటికి తారక్ సినిమా విడుదలై ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తారు. త్రివిక్రమ్ సినీ కెరీర్ లో ఫ్లాపైన సినిమాల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పి తారక్ తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్ సినీ కెరీర్ లో ఏడాది వృథా అయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కు ఎందుకు నో చెప్పారనే ప్రశ్నకు తారక్ ఇప్పటివరకు స్పందించలేదు. రాబోయే రోజుల్లో తారక్ స్పందించే ఛాన్స్ అయితే ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus