హీరోలను ప్రమోట్‌ చేస్తున్న తారక్‌

ఎన్టీఆర్‌ చాలా బిజీ. అవును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈలోగా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ చేస్తున్నారు. బిజీనే మరి అంటారా. మేమంటోంది.. సెట్‌లో కాకుండా, సెట్‌ బయట కూడా బిజీనే. ఎందుకే కొత్త హీరోలను ప్రోత్సహించడానికి ఎన్టీఆర్‌ ఆఫ్‌ షూట్‌ కూడా బిజీ అవుతున్నాడు. రానున్న వారంలో ఎన్టీఆర్‌ రెండు ప్రి రిలీజ్‌ ఈవెంట్లకు హాజరు కాబోతున్నాడు మరి. ఆ లెక్కన బిజీనే కదా మరి. ఇంతకీ ఆ సినిమాలేంటంటే.

ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడుగా నటిస్తున్న ‘తెల్లవారితే గురువారం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ వేడుకు దర్శకధీరుడు రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హాజరవుతారని చిత్రబృందం వెల్లడించింది. మరోవైపు ఈ నెల 26న జరగనున్న ‘రంగ్‌దే’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి కూడా ఎన్టీఆర్‌ వస్తారని వార్తలొస్తున్నాయి. అలా యువ హీరోలను ప్రోత్సహించడానికి ఎన్టీఆర్‌ వస్తున్నాడు. అయితే ఈ రెండు ఈవెంట్లకు ఎన్టీఆర్‌ రావడానికి చాలా కారణాలున్నాయనేది నెటిజన్ల మాట.

కీరవాణి, రాజమౌళి కుటుంబంతో ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. అలా శ్రీసింహాను ప్రమోట్‌ చేయడానికి ఎన్టీఆర్‌ వస్తున్నాడు. అలాగే ‘రంగ్‌దే’ నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఎన్టీఆర్‌కు మంచి అనుబంధమే ఉంది. ఈ కారణంగానే ఆ వేడుకకు ఎన్టీఆర్‌ వస్తున్నాడని అంటున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus