Kalyan Ram, Jr NTR: కళ్యాణ్ రామ్ లైవ్ లో ఉండగా.. కాల్ చేసిన ఎన్టీఆర్..!

నందమూరి తారక రామారావు గారి మనవడిగా, హరికృష్ణ గారి చిన్నాబ్బాయి గా కెరీర్ ను ప్రారంభించాడు ఎన్టీఆర్. అయితే మొదటి నుండీ ఎన్టీఆర్ ను … తాత నందమూరి తారక రామారావు గారు చేరదీసి పెంచారు. ఆయన పోయిన తర్వాత ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ చేరదీయలేదు… కానీ తాత గారి ఆశీర్వాదమో.. ఆ దేవుడి దయవల్లో కానీ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ ను మొదటి నుండీ చేరదీసింది కళ్యాణ్ రామ్ ఒక్కడే.

పటాస్ సినిమా టైం నుండీ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ మరింతగా దగ్గరయ్యారు.ఇక హరికృష్ణ మరణం అనంతరం ఈ అన్నదమ్ములని నందమూరి, నారా కుటుంబాలు దూరంగా ఉంచినా… అన్నదమ్ములు ఒకే మాట మీద ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక వీరి మధ్య ఎంత బాండింగ్ ఉందనేది మనం చాలా సందర్భాల్లో చూశాం. అయితే తాజాగా బింబిసార చిత్రాన్ని వీక్షించిన ఎన్టీఆర్… సినిమా చాలా బాగా వచ్చింది అని అన్నకు కంగ్రాట్స్ చెప్పాడు.

ఇక ప్రమోషన్ల కోసం కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ ఛానల్ లో అప్ క్లోజ్ విత్ ఎన్ కే ఆర్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాడు. ఇందులో అతని బింబిసార ప్రమోషన్ లను షురూ చేశాడు. ఇదే క్రమంలో అఖండ , ఆర్ ఆర్ ఆర్ చిత్రాల ప్రస్తావన వచ్చింది. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ గురించి ఎన్టీఆర్ నటన గురించి టాపిక్ వచ్చింది.

అదే టైంకి ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ కు ఫోన్ చేశాడు.’ ఇప్పుడో తలచుకున్నా .. తనే ఫోన్ చేశాడు .. నూరేళ్ళు ‘ అంటూ ఎన్టీఆర్ తో కాల్ మాట్లాడటానికి వెళ్ళాడు కళ్యాణ్ రామ్. దీంతో అన్నదమ్ముల మధ్య బాండింగ్ అలాంటిది అంటూ నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus