Jr NTR: ఆ సినిమాను పక్కన పెట్టేసిన తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ మాస్ రోల్స్ లో మెప్పిస్తే మరికొన్ని సినిమాల్లో తారక్ క్లాస్ రోల్స్ లో నటించి మెప్పించారు. ఎన్టీఆర్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. బాలీవుడ్ లో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ పూర్తయ్యాయి. ముంబై ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ కు జక్కన్నలో నచ్చే విషయమేంటని ప్రశ్న ఎదురైంది.

అందరినీ ఒక ఫ్లాట్ ఫామ్ కు తీసుకొచ్చే వ్యక్తి రాజమౌళి అని తారక్ వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో కష్టంగా అనిపించిన విషయమేమిటనే ప్రశ్నకు జక్కన్న విజన్ లో ఉండటం చాలా కష్టమని తారక్ చెప్పుకొచ్చారు. అలియాభట్ కు తన పొటెన్షియల్ ఏమిటో తనకు తెలుసని తారక్ అన్నారు. రాజమౌళికి చిరాకు తెప్పించాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నకు ఆయన మాట వినకపోతే చిరాకు వస్తుందని తారక్ పేర్కొన్నారు.

మీడియా ప్రతినిధులు ఆర్ఆర్ఆర్ కాకుండా మీ కెరీర్ లో బెస్ట్ 3 సినిమాలు ఏమిటని తారక్ ను అడిగారు. ఆ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ టెంపర్, జై లవకుశ, జనతా గ్యారేజ్ అని చెప్పారు. వెంటనే జక్కన్న అదుర్స్ సినిమా ఉంది కదా అనడంతో టెంపర్, జై లవకుశ, అదుర్స్ అని చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. అయితే ఆ డైరెక్టర్ సినిమానే టాప్ 3 జాబితా నుంచి ఎన్టీఆర్ తప్పించారు.

ఎన్టీఆర్ చెప్పిన టాప్ 3 సినిమాలలో రాజమౌళి సినిమాలేవీ లేకపోవడం గమనార్హం. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో దాదాపుగా మార్పు లేదని సమాచారం. ఆర్ఆర్ఆర్ మేకర్స్ పరిస్థితులతో సంబంధం లేకుండా ముందుకెళ్లడానికి సిద్ధమయ్యారు. 50 శాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షో సమస్యలు కావని ఆర్ఆర్ఆర్ మేకర్స్ భావిస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus