ఇళయరాజా తర్వాత తనకి బాగా నచ్చిన సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. బహుశా అతని ‘స్టూడెంట్ నెం1’ ‘సింహాద్రి’ ‘యమదొంగ’ ‘దమ్ము'(యవరేజ్) వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకి కీరవాణినే సంగీత దర్శకుడు అవ్వడం వల్ల కూడా అయ్యుండొచ్చు. ప్రస్తుతం అతను హీరోగా నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ కు కూడా కీరవాణినే సంగీత దర్శకుడు. రాజమౌళి సినిమాకి కీరవాణితో పాటు కళ్యాణి మాలిక్ వంటి వారు పనిచేసినప్పటికీ తెర పై మాత్రం సంగీత దర్శకుడిగా కీరవాణి పేరే పడుతుంది అది వేరే విషయం అనుకోండి..!
Click Here To Watch NEW Trailer
అయితే రాజమౌళికి కీరవాణి అద్భుతమైన ఔట్ఫుట్ ను ఇస్తాడు అన్నది జగమెరిగిన సత్యమే. గతంలో అయితే కీరవాణికి… రాజమౌళి ప్లేస్ లో రాఘవేంద్ర రావు గారు ఉండేవారు. ఆయన సినిమాలకి కీరవాణి అందించే సంగీతం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. వీరి కాంబినేషన్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా… పాటలు మాత్రం అదిరిపోయేవి. 1995 లో వీరి కాంబినేషన్లో ‘ఘరానా బుల్లోడు’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
కానీ ‘భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా’ అనే పాట ఒకటి ఉంటుంది’. ఇది ఆ సినిమాలో ఉన్న సూపర్ హిట్ సాంగ్. అప్పట్లో ఓ ఊపు ఊపేసింది కూడా..! కానీ ఈ పాట అంటే ఎన్టీఆర్ కు అస్సలు ఇష్టం ఉండదట. ‘లిరిక్స్ వల్లో లేక ఏమో కానీ ఈ పాటని హమ్ చేయడం కూడా అతనికి ఇరిటేషన్ అట’. ఇదే విషయాన్ని ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్స్ లో భాగంగా కీరవాణికి నేరుగా చెప్పాడు ఎన్టీఆర్. అలా నాగార్జున సూపర్ హిట్ సాంగ్ ఎన్టీఆర్ దృష్టిలో చెత్త పాట అనమాట..!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!