Koratala Siva: కొరటాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న ఫాన్స్… ఇదే కారణమా?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలన్నింటినీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈయన రాజమౌళి సినిమా తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్నారు.ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక ఈ సినిమా గురించి తాజాగా వరుస అప్డేట్స్ వినబడుతున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇందులో ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా సీరియల్ నటించే చైత్ర రాయ్ ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించే అవకాశాన్ని అందుకుందంటూ వార్తలు వచ్చాయి. కన్నడ నటిగా ఎన్నో కన్నడ తెలుగు సీరియల్స్ లో నటిస్తున్నటువంటి ఈమె సినిమా అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తుంది..

అయితే తాజాగా మని చందన అనే మరో సీరియల్ నటి కూడా ఈ సినిమాలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే తాజాగా మని చందన ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ సినిమాలో ఈమె హీరోయిన్ జాన్వీ కపూర్ తల్లి పాత్రలో నటించబోతున్నారని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా వరుసగా సీరియల్ ఆర్టిస్టులు అందరిని సినిమాల్లోకి తీసుకుంటూ కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారా లేకపోతే సీరియల్ చేస్తున్నారా అంటూ కొరటాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుత ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus