Jr NTR: తారక్ అభిమానులు అప్పటివరకు ఆగక తప్పదా?

  • December 23, 2022 / 12:36 PM IST

గడిచిన నాలుగేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక్క సినిమా ఆర్.ఆర్.ఆర్ మాత్రమేననే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఒక్క సినిమా కోసం ఇన్ని సంవత్సరాల సమయం కేటాయించడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసినా తారక్ మాత్రం వేర్వేరు కారణాల వల్ల ఇంత సమయం కేటాయించాల్సి వచ్చింది. ఎన్టీఆర్ 30 కొరటాల శివ డైరెక్షన్ లో ఫిక్స్ కాగా ఎన్టీఆర్31 ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

తారక్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించారని అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఇప్పటివరకు పోషించిన రోల్స్ కు భిన్నమైన రోల్స్ లో ఈ మూవీలో కనిపించనున్నారు. మరోవైపు తారక్32 ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటనలేవీ 2023లో రాకపోవచ్చని సమాచారం. తారక్ ఈ మధ్య కాలంలో కొత్త కథలను కూడా వినడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లపై తారక్ ఫుల్ ఫోకస్ పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తారక్ రేంజ్ సినిమా సినిమాకు మారుతుండగా కథ మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే తారక్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సమాచారం అందుతోంది.

తారక్ కు జోడీగా చేయడానికి ఇతర భాషల హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తుండగా తారక్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. తారక్ టాలెంట్ కు తగిన సినిమాల్లో నటిస్తే మాత్రం తారక్ మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus