టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం అద్భుతంగా పలికిస్తుండటం ఈ స్టార్ హీరోకు ఒకింత కలిసొస్తోందని చెప్పవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ (N .T. Rama Rao) జూనియర్ ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా చూడాలని తారక్ గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకున్నారట. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) ఈ విషయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేయాలని అనుకున్నానని రాఘవేంద్ర రావు అన్నారు.
తన మనవడు తారక్ ను హీరోగా నిలబెట్టాలని రామారావు ఒక సందర్భంలో చెప్పారని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. రాజమౌళి (S. S. Rajamouli) పనితనం తెలిసి ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్1 (Student No: 1) సినిమాను ప్లాన్ చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. స్టూడెంట్ నంబర్1 ఎన్టీఆర్, జక్కన్న కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ కు ఎంత ఇష్టమో రాఘవేంద్రరావు కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా దేవర (Devara) సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర సినిమా టెక్నికల్ గా భారీ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలను కచ్చితంగా అందుకోనుందని తెలుస్తోంది. దేవర సినిమా సక్సెస్ సాధిస్తే జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యకమవుతున్నాయి.
జాన్వీ కపూర్ కు ఇప్పటికే చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో సినిమాలో ఛాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో సైతం జాన్వీ కపూర్ పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారని సినీవర్గాల్లోజోరుగా వినిపిస్తుండటం గమనార్హం. జాన్వీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. జాన్వీ కపూర్ టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతున్నారు.