తారక్ (Jr NTR) ఆఫ్ స్క్రీన్ చాలా సరదాగా ఉంటాడు అని అంటుంటారు. అయితే అందరితో అతనికి అంత వైబ్ ఉండదని, కొంతమందితో మాత్రమే అలా ఉంటాడు అని అంటుంటారు. గతంలో ఆ సరదా ఏంటో మనం రామ్‌చరణ్‌తో (Ram Charan) ఉన్నప్పుడు చూశాం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా ప్రచారంలో భాగంగా మనం చూశాం కూడా. చరణ్‌ను ఊరికనే తారక్ గిల్లుతుంటాడు రాజమౌళినే (S. S. Rajamouli) చెప్పారు. అప్పుడు స్టేజీ మీదే చూశాం కూడా. ఇప్పుడు మరోసారి స్టేజీ మీద చూశాం.
‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా సక్సెస్ మీట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారక్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ క్రమంలో ఆ సినిమా గురించి, తన సినిమాల గురించి చెప్పాడు. అలాగే సినిమా టీమ్‌కి జ్ఞాపికలు ఇచ్చాడు. అలా తన బావమరిది, సినిమా హీరోల్లో ఒకరైన నార్నె నితిన్‌కి (Narne Nithin) కూడా ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా రిబ్స్ మీద సరదాగా ఓ గిల్లు గిల్లాడు. తారక్ ఎంత ముద్దుగా గిల్లాడో, నితిన్ అంతే ముచ్చటగా కేక పెట్టాడు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నార్నే నితిన్ గురించి ఎన్టీఆర్ చెబుతూ.. నా పెళ్లి 2011లో అయింది. అప్పుడు చిన్న పిల్లవాడు. ఇంటికి వెళ్లినప్పుడు పెద్దగా దగ్గరకు వచ్చేవాడు కాదు. ధైర్యం చేసి ఎప్పుడూ మాట్లాడింది లేదు. దీంతో వీడేంటి ఇలా ఉన్నాడు, వాడు కదా మాట్లాడాల్సింది అని అనుకునేవాణ్ని. అయితే కొన్నేళ్ల తర్వాత ఓ రోజు ధైర్యం చేసి నాతో మాట్లాడాడు. అదే బావా నేను యాక్టర్‌ని అవుతా అని చెప్పాడు అని తారక్ తెలిపాడు.
దానికి తాను కూడా అంతే ధైర్యంగా సరే సావు పో.. నా సపోర్ట్ అయితే నీకు ఉండదు అని చెప్పాను అని ఎన్టీఆర్ సరదాగా నవ్వేశాడు. చెప్పినట్లుగానే ఇప్పటివరకు నితిన్‌కి తారక్ నేరుగా సపోర్టు చేసింది కనిపించలేదు. అయితే బ్యాక్‌ఎండ్‌లో బాగానే సపోర్టు చేస్తాడని టాలీవుడ్ టాక్.
#JrNTR Making Fun With #NarneNithiin#NTRForMAD #MadSquare pic.twitter.com/N1EGzPos5d
— Filmy Focus (@FilmyFocus) April 4, 2025