Jr NTR: బెంగళూరు బయలుదేరిన ఎన్టీఆర్.. ఫ్లైట్ లో దర్జాగా కూర్చుని… ఫోటో వైరల్ ..!

కర్ణాటక విధాన సౌధలో జరగబోయే ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న(ఈరోజు) జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ వెళ్లబోతున్నాడు. ఈ కార్యక్రమంలో దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక అత్యున్నత పురస్కారం అయిన ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రధానం చేయనుంది.దీని కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కార్యాలయం నుండి ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది. అసెంబ్లీలో జరగబోయే ఈవెంట్ కు ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

ఎన్టీఆర్ కు పునీత్ రాజ్ కుమార్ కి మంచి స్నేహం ఉంది.ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. పునీత్ నటించిన ఓ సినిమాలో ఎన్టీఆర్ ప్రత్యేక గీతం పాడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా కన్నడ రాష్ట్రానికి చెందిన కుందాపుర అనే గ్రామంలో జన్మించారు. దీంతో రాజ్ కుమార్ ఫ్యామిలీకి కూడా ఆమె పెద్ద ఫ్యాన్. ఇదిలా ఉండగా.. కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఆల్రెడీ బయలుదేరాడు.

తాజాగా ఆయన ఫ్లైట్ లో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ నీట్ గా టక్ అది చేసుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ కు ఎయిర్ పోర్ట్ లో కర్ణాటక మినిస్టర్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus