ప్రస్తుత కాలంలో ఎన్నో సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ అందుబాటులోకి రావడంతో వీటి ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారి వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేయడంతో వీరిని అనుసరించే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సెలబ్రిటీల కోసం అలాగే యూజర్ల కోసం మరొక సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ కు పోటీగా మెటా అధినేత జూకర్ బర్గ్ సరికొత్తగా ‘థ్రెడ్స్’ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ప్లే స్టోర్ లోకి అందుబాటులోకి రావడమే ఆలస్యం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య అధికమవుతుంది. తాజాగా ఈ సరికొత్త యాప్ లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తుంది. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించి విషయాలను అభిమానులతో పంచుకునే ఎన్టీఆర్ సరికొత్త యాప్ అయినటువంటి ఈ థ్రెడ్స్ యాప్ లోకి కూడా అడుగు పెట్టారు.
ఇక ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోని ఫాలో అవ్వడం కోసం వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆయనను అనుసరించే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది.అదేవిధంగా ఈ సరికొత్త ఆప్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి టాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ పేరు సంపాదించుకున్నారు.
ఇకపై ఎన్టీఆర్ (Jr NTR) ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా మాత్రమే కాకుండా ఈ యాప్ ద్వారా కూడా తన సినిమా అప్డేట్స్ తెలియజేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు.