Jr NTR, Koratala Siva: బడ్జెట్ విషయంలో ఎన్టీఆర్ తగ్గడం లేదా?

ఆచార్య సినిమా దర్శకుడిగా కొరటాల శివపై తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమైన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో కొరటాల శివపై తర్వాత సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సాధించాల్సిన బాధ్యత పెరిగింది. ఈ సినిమాకు తాజాగా బడ్జెట్ ఫిక్స్ అయిందని 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. పారితోషికాలతో కలిపి ఈ మొత్తం బడ్జెట్ గా ఫిక్స్ అయిందని బోగట్టా. నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతూ ఉండటంతో పెద్ద సినిమాల బడ్జెట్ విషయంలో నిర్మాతలు సైతం రాజీ పడటం లేదు.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైనా క్వాలిటీ కోసం కొరటాల శివ మళ్లీ ఈ సినిమా స్క్రిప్ట్ పై రీ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. జూన్ నెల సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. బడ్జెట్ విషయంలో అస్సలు రాజీ పడవద్దని తారక్ సూచించారని తెలుస్తోంది. హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారో లేదో అనే ప్రశ్నకు సంబంధించి కూడా త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తో బాలీవుడ్ లో కూడా సత్తా చాటిన తారక్ తర్వాత సినిమాతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. రివేంజ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాపైనా ఎన్టీఆర్ కు కొరటాల శివపై కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గలేదని కొరటాల శివ సినిమాతో తను కోరుకున్న సక్సెస్ దక్కుతుందని తారక్ భావిస్తున్నారని సమాచారం.

ఇండస్ట్రీలోని ఫ్లాప్ సెంటిమెంట్లను సైతం ఈ సినిమాతో బ్రేక్ చేస్తానని తారక్ ఫీలవుతున్నారు. తారక్ తర్వాత సినిమాతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని తారక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus