Jr NTR, Koratala Siva: ఆ సీన్ చూస్తే తారక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వస్తాయట!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా మొదలుపెట్టినా పరవాలేదని అయితే సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే అనధికారికంగా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీలో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

ఈ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని బోగట్టా. యాక్షన్ సీన్ తో ఇంటర్వెల్ సీన్ ఉంటుందని ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఈ సీన్ ను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. గతంలో తారక్ ఎప్పుడూ కనిపించని విధంగా ఈ సీన్ ఉంటుందని తెలుస్తోంది. ఆగష్టులో ఈ సినిమా షూట్ మొదలుకానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ బరువు తగ్గనున్నారని సమాచారం అందుతోంది. తారక్ ఈ సినిమా కోసం ఏకంగా 9 కిలోలు బరువు తగ్గుతున్నారని తెలుస్తోంది.

2023 సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం జనతా గ్యారేజ్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. తారక్ తన తర్వాత సినిమాతో ఆ సినిమాను మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

తారక్ కొరటాల శివ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. కొరటాల శివకు కెరీర్ పరంగా ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus