జూ.ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు.. ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఒకింత ఆందోళనకు గురయ్యారు అనే చెప్పాలి.ఈ క్రమంలో అతను త్వరగా కోలుకోవాలని పూజలు,హోమాలు వంటివి జరిపించిన సందర్భాలు కూడా మనం చేస్తూ వచ్చాము. ఇక టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వెంటనే.. ఎన్టీఆర్ తన ఫ్యామిలీ నుండీ ఐసోలేట్ చేసుకోవడం కోసం..
గత రెండు వారాలుగా తన గెస్ట్ హౌస్ లో ఉంటూ వచ్చాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ చికిత్స పొందుతూ అలాగే తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ మాట్లాడుతూ కాలక్షేపం చేశారు ఎన్టీఆర్. ఇక ఇటీవల ఎన్టీఆర్ మళ్లీ కరోనా టెస్ట్ చేయించుకోగా ఈసారి రిజల్ట్ నెగిటివ్ వచ్చింది.ఇక కరోనా నుండీ కోలుకున్న వెంటనే ఎన్టీఆర్ గుడికి వెళ్ళి అర్చన చేయించుకున్నాడు. అక్కడ పూజారి తో ఎన్టీఆర్ దిగిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ ట్రెడిషనల్ వేర్ లో ఉండడాన్ని మనం గమనించవచ్చు.
ఈ ఫోటో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది ఎన్టీఆర్ కు 30 వ చిత్రం కావడం విశేషం. దీంతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో కూడా ఎన్టీఆర్ ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.