యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి నటుడు, డ్యాన్సర్ మాత్రమే కాదు.. మనసున్న మంచి మనిషి అని ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారు చాలామంది చెప్పారు. ఇప్పుడు తారక్ లోని గొప్పదనాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “హిందీ బిగ్ బాస్ షో నేను చూడలేదు, తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షో నాకు బాగా నచ్చింది. ఆ షో నడిపించడానికి గల సమయస్పూర్తి, వాక్చాతుర్యం ఎన్టీఆర్ కు ఉంది” అని అన్నారు. అంతేకాదు కొన్నేళ్ళక్రితం జరిగిన సంఘటనను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. అన్నగారు (నందమూరి తారకరామారావు) పిల్లల్లో నాకు మొదటగా హరికృష్ణ పరిచయం అయ్యారు.
ఆయన కుమారుడు ఎన్టీఆర్ తో కూడా మంచి అనుబంధం ఉంది. బాలరామాయణం సినిమా షూటింగ్ సమయంలో ట్రైన్ లో వెళ్తునప్పుడు క్యాటరింగ్ సౌకర్యం ఆగిపోయింది. ఆకలితో ఉన్న నాకు చిన్నారి ఎన్టీఆర్(12) ఒక బాక్స్ ఇచ్చి తినమని చెప్పాడు. ఆకలితో ఉన్న సమయంలో ఆ బాక్స్ ని చూసిన వెంటనే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి” అని గోపాలకృష్ణ చెప్పారు. పన్నెండేళ్ళ వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ లో అన్నగారు కనిపించారని వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.