ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్న సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లను సాధిస్తున్నాయి. దేవర సినిమాలో కూడా గ్రాఫిక్స్ కు సంబంధించిన సీన్లు ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ సూచనలు చేసినట్టు భోగట్టా. విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు విషయంలో రాజీ పడవద్దని తారక్ చెప్పినట్టు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర విషయంలో ఊహించని స్థాయిలో కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ లేదని భావిస్తున్నట్టు భోగట్టా. సరిగ్గా ప్రమోషన్స్ చేస్తే ఈ సినిమా 1000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారని సమాచారం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో కూడా మార్కెట్ ను పెంచుకోవడానికి అడుగులు వేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా బిజినెస్ పూర్తైన తర్వాత లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుల హీరోగా ఉన్నారు. దర్శకులు కోరిన విధంగా నటిస్తూ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మాస్, యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇతర హీరోల అభిమానులకు సైతం దగ్గరవుతున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ వచ్చే ఏడాది మొదలవుతుందని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.