Jr NTR: రికార్డులు క్రియేట్ చేస్తున్న తారక్ కొత్త యాడ్.. ప్రభాస్ బ్యూటీతో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అటు మాస్ ప్రేక్షకుల్లో, ఇటు క్లాస్ ప్రేక్షకుల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆ అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. తారక్, కృతి సనన్ కలిసి నటించిన కొత్త యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ఆపీ ఫిజ్ కోసం తారక్ ఈ యాడ్ లో కలిసి నటించడం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. యాడ్ లో కృతి సనన్ “చూడు.. ఇంకొక్క కొత్తరోజు.. ఈరోజు నువ్వు కూడా కొత్తగా ఏదైనా చేసేయ్” అని చెప్పగా జూనియర్ ఎన్టీఆర్ ” అందిరిలా నిన్ను మారమంటున్న ఈ లోకం.. ఏదీ వినొద్దు ఏమీ అనొద్దు” అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కృతి సనన్ “నువ్వు అందరిలా కాదు నీలా ఎవరూ లేరు” అని అన్నారు.

ఎన్టీఆర్ “నువ్వేంటన్నది అందరికీ చూపించు.. ఉత్సాహం కొత్తది.. రంగు రూపులు కొత్తవి” అని పేర్కొన్నారు. ఆ తర్వాత కృతి సనన్ “నీ హుషారైన రంగులు ఏముంటున్నాయో విను.. ఇవాళ కొత్తదేదైనా చేసి చూపించు ఆల్ న్యూ ఆఫీ ఫిజ్” అంటూ యాడ్ ను ముగించారు. ఆదిపురుష్ లో ప్రభాస్ కు జోడీగా నటించిన కృతి తారక్ తో కలిసి యాడ్ లో నటించడం గమనార్హం. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ యాడ్ షూట్ జరిగిందని సమాచారం.

తారక్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ యాడ్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. తారక్ ప్రమోషన్స్ వల్ల ఆపీ ఫీజ్ రేంజ్ మరింత పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పరిమితంగా బ్రాండ్స్ ను ఎంచుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను నటించిన యాడ్స్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు. యాడ్స్ ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus