ఎన్టీఆర్ మూవీపై పెరుగుతున్న అంచనాలు. రికార్డులు బ్రేక్ అవుతాయా?

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఈ ఏడాది నవంబర్ నెల నుంచి మొదలుకానుంది. ఈ సినిమా తారక్ కెరీర్ లో స్పెషల్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేయనున్నారని హాలీవుడ్ హీరోయిన్ ఈ సినిమా కోసం పని చేయనున్నారని తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఎన్టీఆర్31 స్క్రిప్ట్ కు సంబంధించి చాలా పనులు పూర్తి చేశారని సలార్ రిలీజ్ తర్వాత తారక్ తో మరోసారి చర్చించి ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథకు సంబంధించి పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు చేయనున్నారు. ఎన్టీఆర్31 సినిమాతో తారక్ సోలోగా మరింత ఎదగనున్నారని బోగట్టా. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ప్రపంచ స్థాయిలో ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయనుందో చూడాలి. ఈ మూవీ 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత తారక్ నటించే సినిమాకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ ప్రతి సినిమాను యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

సలార్ మూవీ షూట్ పనులతో ప్రశాంత్ నీల్ బిజీగా ఉండగా ఉగాది కానుకగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ రానుందని తెలుస్తోంది. సలార్ సినిమా ప్రశాంత్ నీల్ మార్కెట్ ను ఏ రేంజ్ లో పెంచుతుందో చూడాల్సి ఉంది. రాజమౌళిని మించి పేరు వచ్చేలా ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus