Jr NTR, Ram Charan: అఖండ మూవీ జక్కన్నలో కాన్ఫిడెన్స్ పెంచిందా?

బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని బాలకృష్ణ అఖండ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. ఈ సినిమా నిడివి ఏకంగా 2 గంటల 47 నిమిషాలు అనే సంగతి తెలిసిందే. అయితే నిడివి గురించి పట్టించుకోకుండా ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేశారు. అఖండ సక్సెస్ తో ఆర్ఆర్ఆర్ మూవీ రన్ టైమ్ విషయంలో టెన్షన్ అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ నిడివి 3 గంటల 10 నిమిషాలు అని వార్తలు వస్తుండగా అఖండ సక్సెస్ తో రాజమౌళికి కూడా ఆర్ఆర్ఆర్ నిడివి విషయంలో కంగారు అవసరం లేదని భావన ఏర్పడినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీ నిడివి మూడు గంటలైనా ఓకే అంటూ చరణ్, తారక్ అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ పై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మలయాళ మూవీ మరక్కార్ మూడు గంటల నిడివితో రిలీజ్ కాగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమా బాగుంటే రన్ టైమ్ ను ప్రేక్షకులు పట్టించుకోరని స్టార్ హీరోల సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్, చరణ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. అతి త్వరలో ఆర్ఆర్ఆర్ మూవీ బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. రాబోయే వారం రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus