రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. రేపో మాపో రాజమౌళి ఖాతాలో మరో రూ.1000 కోట్ల మూవీ పడడం గ్యారెంటీగా కనిపిస్తోంది. చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కూడా పెద్ద ఈ మూవీని రిపీట్స్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ అభిమానులకి కొంత నిరాశ కలిగిందనే చెప్పాలి. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ కంటే చరణ్ కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉందని, అంతేకాకుండా చరణ్ ముందు ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపించాడు రాజమౌళి అని,
ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో చరణ్ కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం, చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ ను ఫైట్లోకి దించడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించాడు. ఇటీవల ఎన్టీఆర్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘చరణ్ తో పోలిస్తే మీకు స్క్రీన్ స్పేస్ తక్కువ దక్కింది, అలాగే మీ పాత్రకి ప్రాముఖ్యత కూడా తగ్గింది అంటూ అభిమానులు ఫీలవుతున్నారు.
వారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా?’ అంటూ ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ.. ‘అస్సలు కాదు. అది చాలా తప్పు. రాజమౌళి ఇద్దరి పాత్రల్ని బాగా హ్యాండిల్ చేసాడు. ఇద్దరికీ సమన ప్రాధాన్యత ఇచ్చాడు. షూటింగ్ టైములో కూడా చరణ్- నేను ఒకరి పనితీరుకి మరొకరం ప్రశంసించుకునేవాళ్ళం. సినిమా విడుదలయ్యాక కూడా అదే విధంగా ఒకరి పాత్రని మరొకరం ప్రశంసించుకుంటున్నాం. రాజమౌళి కాకుండా వేరే ఏ దర్శకుడు కూడా ఇంతలా మల్టీస్టారర్ ను హ్యాండిల్ చేయలేరు’ అంటూ చెప్పుకొచ్చాడు.
నిజమే ‘ఆర్.ఆర్.ఆర్’ లో రాజమౌళి ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చాడు. ‘కొమరం భీముడొ’ పాటలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించేలా చేసాడు రాజమౌళి. ఆ పాత్రకి ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ సూట్ అవ్వరు అనేది వాస్తవం. అలాగే క్లైమాక్స్ లో చరణ్ ను అల్లూరి పాత్రలో శ్రీరాముడు గుర్తుకొచ్చేలా చూపించాడు రాజమౌళి.